March 28, 202503:39:51 AM

Vettaiyan First Review: ‘వేట్టయన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘జైలర్’ (Jailer)  తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చారు రజినీకాంత్ (Rajinikanth)  . ఆయన స్టార్ డం ఏంటనేది ఆ సినిమాతో మరోసారి నిరూపించారు.ఇక ఆయన హీరోగా రూపొందిన మరో సినిమా ‘వేట్టయన్- ది హంటర్’  (Vettaiyan)  . ‘జై భీమ్’ తో ఆకట్టుకున్న టి.జె.జ్ఞానవేల్  (T. J. Gnanavel) ఈ చిత్రానికి దర్శకుడు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)  , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ,రానా దగ్గుబాటి  (Rana) ,రావు రమేష్ (Rao Ramesh) కూడా సినిమాలో కీలక పాత్ర పోషించారు. అనిరుధ్  (Anirudh Ravichander)   ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ‘మనసిలాయో’ అనే పాట బాగా వైరల్ అయ్యింది.

Vettaiyan First Review:

అందులో హీరోయిన్ మంజు వారియర్ (Manju Warrier) వేసిన స్టెప్స్.. చాలా రీల్స్ చేసేలా చేసింది. ఇదిలా ఉండగా.. తమిళంలో కొంతమంది సినీ ప్రముఖులకు ‘వేట్టయన్- ది హంటర్’ స్పెషల్ షోలు వేయడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. ఎస్.పి అజిత్ కుమార్(రజినీకాంత్) సిటీలో ఉన్న క్రిమినల్స్ అందరినీ ఎన్కౌంటర్ చేసి హతమారుస్తూ ఉంటాడు. ఈ విషయంలో అతనికి డీజీపీ సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నుండి ఒత్తిడి ఎదురైనా అతను తగ్గడు .

ఎందుకు అజిత్ కుమార్.. సత్యదేవ్ మాటని లెక్కచేయడం లేదు. అతని గతమేంటి? అతని ఫ్యామిలీకి జరిగిన నష్టం ఏంటి? మధ్యలో నటరాజ్(రానా) పాత్ర ఏంటి? అనేది అసలైన కథ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఉంటుందట. రజినీకాంత్ ఎంట్రీ నుండి తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ వంటివి మంచి కిక్ ఇస్తాయట. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు.

సెకండాఫ్ లో వచ్చే ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయట. ‘మానసిలాయో’ సాంగ్ ని బాగా పిక్చరైజ్ చేసారని తెలుస్తుంది. మంజు వారియర్ కూడా బాగా నటించిందట. రితిక సింగ్ (Ritika Singh), రోహిణి..ల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా ‘జై భీమ్’ మాదిరే ఓ సోషల్ మెసేజ్ ఉంటుందని.. కొన్ని సీన్లు చాలా సహజంగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరోసారి హైలెట్ అవుతుందని సినిమా చూసిన వారు చెబుతున్నారు.

‘శ్వాగ్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.