March 13, 202505:20:06 PM

Kalki 2: ‘కల్కి 2’ షూటింగ్‌.. నిర్మాత షాకింగ్‌ అప్‌డేట్‌.. ఏం చెప్పారంటే?

ప్రభాస్‌ (Prabhas) ఓకే చేస్తున్న వరుస సినిమాల లెక్క చూస్తుంటే ఏ సినిమా ఎంత అయింది, ఎప్పుడు పూర్తవుతుంది, అసలు ఎప్పుడు మొదలైంది అనే వివరాలు అర్థం కావడం లేదు. సినిమా షూటింగ్‌ అయిందో లేదో అని అనుకుంటుంటే.. ఆల్‌ రెడీ షూటింగ్‌ చాలా వరకు పూర్తయింది అనే మాటలు వినిపిస్తున్నాయి. మరికొన్ని సినిమాల షూటింగ్‌ చాలా వరకు అయిందతి అంటే.. లేదు లేదు ఇంకా మొదలే కాలేదు అంటున్నారు. తాజాగా, ఓ సినిమా అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

Kalki 2

ఆ సినిమానే ‘కల్కి 2’ (Kalki 2). ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అని అనుకుంటూ ఉంటే.. ఏకంగా మూడింట ఒక వంతు సినిమా పూర్తయిపోయింది అని నిర్మాత చెప్పి షాక్‌ ఇచ్చారు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) కాంబినేషన్‌లో వచ్చి ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రూపొందుతున్న విషయం తెలిసిందే. దీని అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నార.

అయితే, గోవాలో జరుగుతోన్న ‘ఇఫీ’ వేడుకల్లో ‘కల్కి’ నిర్మాతలు స్వప్న (Swapna Dutt) – ప్రియాంక  (Priyanka Dutt) పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమా గురించి కాస్త సమాచారం ఇచ్చారు. ‘కల్కి’ రెండో పార్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని, రెగ్యులర్‌ షూట్‌ ఎప్పటి నుండి ప్రారంభించాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అంతా సిద్ధమయ్యాక వివరాలు ప్రకటిస్తామన్నారు. అలాగే ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD)లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణె..

రెండో ‘కల్కి’లో కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపించనుందని కూడా చెప్పారు. అంతేకాదు ‘కల్కి 2898 ఏడీ’ చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్‌కు సంబంధించిన కొంత షూట్‌ చేశామని కూడా చెప్పారు. మొత్తంగా పార్ట్‌ 2కు సంబంధించి 35 శాతం షూటింగ్‌ జరిగిందని తెలిపారు. ‘కల్కి 2898 ఏడీ’ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. తొలి పార్ట్‌కి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని సీక్వెల్‌ను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తామని ఇప్పటికే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.