March 23, 202506:11:43 AM

Prabhas: సలార్ మేకర్స్ నరసింహా.. ప్రభాస్ అంటున్నారే?

Prabhas

హోంబాలే ఫిల్మ్స్‌ పేరు వినగానే పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు గుర్తుకువస్తాయి. ‘కేజీఎఫ్ (K.G.F ),’ ‘కాంతార,’ ‘సలార్’ (Salaar) లాంటి చిత్రాలతో ఈ సంస్థ దేశవ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకుంది. ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల విడుదల చేసిన ‘మహావతార్ నరసింహా’ మోషన్ పోస్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నరసింహ అవతారం నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమా 3D హై విజువల్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. ఇటీవల కాలంలో దేవుడి నేపథ్య సినిమాల పట్ల ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు.

Prabhas

‘కాంతార’ లాంటి చిత్రాలు ఈ ట్రెండ్‌ను మరింత పటిష్ఠం చేశాయి. ఈ కోవలోనే ‘మహావతార్ నరసింహా’ సినిమా నిర్మితమవుతోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. నరసింహుడి అవతారాన్ని ఆధారంగా చేసుకుని ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభవం అందించాలనే ఉద్దేశంతో హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను రూపొందిస్తోంది. పోస్టర్‌లోని నరసింహుడి రూపం, దైవత్వం, శక్తి ప్రతిభింబం తగిన స్థాయిలో ఆకట్టుకునేలా ఉంది.

“విశ్వాసం సవాలుగా ఉన్నప్పుడు అతను కనిపిస్తాడు” అనే ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేస్తోంది. నరసింహుడి పాత్రలో ప్రభాస్ (Prabhas) నటిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ప్రభాస్ హోంబాలే ఫిల్మ్స్‌తో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇదే ఆ రెండు ప్రాజెక్ట్‌లలో ఒకటా? అనే సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. ఒకవేళ ప్రభాస్ నరసింహుడి పాత్రలో నటిస్తే ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

మరి ప్రభాస్ కాకుండా మరో నటుడు ఈ పాత్రను పోషిస్తారా? అన్నది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. నరసింహుడి రూపం చూపిన మోషన్ పోస్టర్ చూసిన నెటిజన్లు దీనిపై విపరీతమైన ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని సమాచారం. వచ్చే ఏడాది విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.