March 23, 202509:29:12 AM

Pushpa 2 The Rule Trailer: పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది.. వైల్డ్ ఫైర్ అంతే!

Pushpa 2

పుష్ప పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఆ సినిమా టైమ్లోనే దానికి కొనసాగింపుగా సెకండ్ పార్ట్ ఉంటుందని ప్రకటించారు.కాబట్టి సహజంగానే పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో పుష్ప భారీగా కలెక్ట్ చేసింది అంటూ ఏమీ లేదు. మిగతా భాషల్లో హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ సినిమా భారీ లాభాలు అందించింది. పార్ట్ 2 పై తెలుగులో కంటే ఎక్కువగా హిందీలో హైప్ ఉంది. ట్రేడ్ సర్కిల్స్ అంచనాల ప్రకారం కేవలం హిందీ నుండే ఈ సినిమాకి రూ.1000 కోట్లు వస్తుందని అంటున్నారు.

Pushpa 2 The Rule Trailer

బీహార్ వంటి మాస్ ఏరియాల్లో పుష్ప భారీగా కలెక్ట్ చేసింది. అందుకే పుష్ప 2 ప్రమోషన్స్ ను అక్కడి నుండే మొదలుపెట్టారు. ట్రైలర్ లాంచ్ వేడుకని అక్కడ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. పుష్ప 2 ట్రైలర్ నిమిషాల నిడివి కలిగి ఉంది. బెన్వర్ సింగ్ షెకావత్ , పుష్ప రాజ్ .. ల మధ్య పోరుని ప్రధానంగా చేసుకుని పార్ట్ 2 ని తీర్చిదిద్దాడు దర్శకుడు సుకుమార్. ఈ ట్రైలర్ తో ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు. అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ .. లు పోటీ పడి నటించినట్టు కూడా ట్రైలర్ చెబుతుంది.

Pushpa 2

అంతేకాదు హీరోయిన్ రశ్మిక తో రొమాన్స్, శ్రీలీల ఐటం సాంగ్ విజువల్స్ కూడా ట్రైలర్ లో కనిపించాయి. సునీల్, అనసూయ పాత్రలు కూడా కనిపించాయి. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ ట్రైలర్ కి మంచి హై ఇచ్చింది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పేరు కూడా హైలెట్ చేసి చూపించారు. ట్రైలర్ ను మీరు కూడా చూడండి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.