March 23, 202508:25:31 AM

Rana Daggubati: బాక్సాఫీస్ లెక్కలపై బాంబ్ పేల్చిన రానా!

ఈ రోజుల్లో ఏదైనా పెద్ద సినిమా హిట్టయితే చాలు బాక్సాఫీస్ రికార్డులు బ్లాస్ట్ అన్నట్లు ప్రమోట్ చేయడం కామన్. ఇక వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయని పోస్టర్స్ విడుదల చేయడం గతకొన్ని ఏళ్లుగా ట్రెండ్‌గా మారింది. అయితే ఈ కలెక్షన్ పోస్టర్లలో చూపించే లెక్కలపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రీసెంట్‌గా రానా దగ్గుబాటి  (Rana Daggubati)  బాక్సాఫీస్ లెక్కల గురించి చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. అమెజాన్ ప్రైమ్‌ షో కు సంబంధించిన ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ, ‘‘బాక్సాఫీస్ కలెక్షన్ పోస్టర్లలో కనిపించే నంబర్లు నిజమైనవి కావు.

Rana Daggubati

అవి కేవలం మార్కెటింగ్ కోసం మాత్రమే ఉంటాయి’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రాస్ కలెక్షన్స్ అనేవి నిజమైన ఫైనల్ నంబర్లకు సంబంధం లేకుండా ఉంటాయి. ఆ నంబర్లను చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటూ తన అభిప్రాయాన్ని బోల్డ్‌గా వెల్లడించారు. రానా వ్యాఖ్యలతో ఫ్యాన్స్ నుంచి వివిధ రకాల స్పందనలు వస్తున్నాయి. అసలు స్టార్ హీరోల సినిమాలకు చూపించే కలెక్షన్స్ నిజమేనా? అనే సందేహాలు సోషల్ మీడియాలో తెరపైకి వచ్చాయి.

కొందరు నిర్మాతలు తమ సినిమాలను ప్రోత్సహించడానికి కలెక్షన్స్ విషయంలో అబద్ధపు పోస్టర్లు వేస్తారన్న విమర్శలు గతంలోనూ వినిపించాయి. రానా వ్యాఖ్యలతో ఈ అంశం మరింత వైరల్ అయ్యింది. ఇక రానా త్వరలో తన కొత్త టాక్‌ షో ‘ది రానా దగ్గుబాటి షో’ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. నవంబర్ 23 నుంచి ఈ షో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. రాజమౌళి (S. S. Rajamouli), రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma), నాగ చైతన్య(Naga Chaitanya) , శ్రీలీల  (Sreeleela) వంటి ప్రముఖులు ఈ షోలో పాల్గొన్నారు.

షో ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి (Baahubali)  వంటి ప్రాజెక్ట్‌లతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రానా, ఈ షో ద్వారా తన మల్టీటాలెంటెడ్ స్వభావాన్ని మరోసారి ప్రదర్శించబోతున్నాడు. బాక్సాఫీస్ లెక్కలపై రానా (Rana Daggubati) చేసిన కామెంట్స్ పరిశ్రమలో కొత్త చర్చలకు దారితీశాయి. మరి ఈ వ్యాఖ్యలపై ఇతర సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆ సినిమా వస్తే ‘గేమ్ ఛేంజర్’ కి అక్కడ కష్టమే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.