అల్లరి నరేష్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బచ్చల మల్లి’. అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ని కూడా వదిలారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఇది.. 2 నిమిషాల 37 నిడివి కలిగి ఉంది. ‘మీ చిన్నాన్నని నేను మొదటిసారి ఎక్కడ చూశానో తెలుసా అమ్మా?’ అంటూ రావు రమేష్ వాయిస్ ఓవర్ లో బచ్చల మల్లి అదే హీరో అల్లరి నరేష్ ఎంట్రీ ఇచ్చాడు.
Bachhala Malli Trailer Review:
అతని క్యారెక్టర్ ఎలాంటిదో టీజర్తోనే క్లారిటీ ఇచ్చారు. ‘మూర్ఖత్వం, చెడు అలవాట్లు కలిగిన బచ్చల మల్లి ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది?’ అనేది టీజర్ తో చెప్పారు. ఈ ట్రైలర్లో ఆ అలవాట్లు ఉన్నప్పటికీ ఓ అమ్మాయి అతని ప్రేమను యాక్సెప్ట్ చేయడం, ఆమె కోసం అతను చెడు అలవాట్లు మానేయడం అనే దాన్ని చూపించారు. మంచిగా మారుతున్న టైంలో శత్రువుల వల్ల హీరోకి వచ్చిన సమస్యలు ఏంటి? అతని ప్రేమ జీవితం ఎలా అయిపోయింది? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అని ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది.
కథ ఏంటి అనేది.. ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు.’మూర్ఖత్వం కొలవడానికి మిషన్లు రాలేదు’ అంటూ హీరో ఫ్రెండ్ పలికే డైలాగ్ బాగుంది. టేకింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్ కూడా గట్టిగా దట్టించినట్టు స్పష్టమవుతుంది. డిసెంబర్ 20 న ఈ సినిమా విడుదల కాబోతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :