March 21, 202512:17:40 AM

Naga Chaitanya: నాగచైతన్య సినిమా ఛాన్స్‌ పట్టేసిన ‘కిస్సిక్‌’ భామ.. ఎందులో అంటే?

హీరోయిన్లకు ఎప్పుడు సినిమా ఛాన్స్‌లు క్యూ కడతాయో.. ఎప్పుడు దూరమవుతాయో అస్సలు చెప్పలేం. ఇదుగో ఛాన్స్‌ వచ్చింది అనుకునేలోపు వేరే వాళ్లకు వెళ్లిపోతుంది. అలా పెద్దగా ఫామ్‌లో లేని హీరోయిన్లకు కూడా ఛాన్స్‌లు వచ్చేస్తుంటాయి. ఇలాంటి దాఖలాలు గతంలో కొన్ని ఉన్నాయి. తాజా ఉదాహరణ కావాలి అంటే శ్రీలీల (Sreeleela)  పేరు చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు దూరమైన సినిమా ఛాన్స్‌లు తిరిగి వస్తున్నాయి అనిపిస్తోంది. నాగచైతన్య (Naga Chaitanya) 24వ చిత్రంగా ‘విరూపాక్ష’ (Virupaksha) ఫేమ్‌ కార్తీక్‌ దండు (Karthik Varma Dandu) ప్రాజెక్ట్‌ రాబోతోంది.

Naga Chaitanya

బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్(B. V. S. N. Prasad) , సుకుమార్‌ (Sukumar) నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలో సినిమా చిత్రీకరణకు ప్రారంభమవుతుంది అని సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ విషయంలో తర్జనభర్జనలు కొలిక్కి వచ్చాయి అని అంటున్నారు. తొలుత అనుకున్నట్లు మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  కాకుండా మరో నాయికను ఓకే చేశారు అని తెలుస్తోంది. చైతు సినిమా అవకాశం శ్రీలీలకు దక్కింది అని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అంటున్నారు.

Meenakshi Chaudhary

ఆధ్యాత్మిక, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర ‘విరూపాక్ష’ తరహాలోనే కీలకమట. అందుకే శ్రీలీల అయితే బాగుంటుంది అని చెబుతున్నారు. ఈ నెలలో షూటింగ్‌ పనులు మొదలైనా.. నాగ చైతన్య జనవరి నుండి సెట్స్‌లో అడుగు పెడతాడట. ఇక శ్రీలీల సినిమాల సంగతి చూస్తే.. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)  హోల్డ్‌లో ఉంది. ఇక ‘ధమాకా’ (Dhamaka) కాంబో రిపీట్ చేస్తూ రవితేజతో (Ravi Teja) ‘మాస్ జాతర’ (RT75)  అనే సినిమా చేస్తోంది.

నితిన్‌ (Nithin) ‘రాబిన్‌ హుడ్‌’ (Robinhood)  సినిమా ఈ నెలలో రిలీజ్‌ అవుతోంది. ఇవి కాకుండా బాలీవుడ్‌లో కూడా ఓ సినిమాను ఓకే చేసిది కిస్సిక్‌ భామ. అలాగే తమిళ, కన్నడ మార్కెట్లపై కూడా కన్నేసింది అని చెబుతున్నారు. ఒకవేళ అవన్నీ ఓకే అయితే పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగేందుకు ప్లాన్స్ వేసుకుంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఓకే చేసిన సినిమాల విజయాలు చాలా కీలకం.

‘పుష్ప 2’ .. అక్కడ ఇంకో రికార్డు కొట్టింది..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.