March 17, 202509:22:42 PM

Brahmanandam: ఒక్క మాటతో మనిషిని అంచనా వేసేస్తారా? బ్రహ్మానందం మాటలు వైరల్‌?

Brahmanandam about Chiranjeevi issue

బ్రహ్మానందం (Brahmanandam) నటుడిగా ఇప్పటి తరానికి తెలుసు. కానీ ఆయన నటుడు కాకముందు ఓ లెక్చరర్‌. పిల్లలకు పాఠాలు చెబుతూ, విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ల ఉన్నతికి పాల్పడ్డారు. ఓ క్షణంలో సినిమాలవైపు అనుకొని వచ్చి.. ఆ తర్వాత మెగాస్టార్‌ (అప్పటికి కాదు) చిరంజీవి సాయంతో సినిమా వాళ్లకు పరిచయమయ్యారు. ఇప్పుడు 1200కి పైగా సినిమాల్లో నటించి కామెడీ కింగ్‌ అయ్యారు. అయితే ఇంత జరిగినా ఆయనెప్పుడూ తొలినాటి రోజుల్ని మరచిపోలేదు.

Brahmanandam

Brahmanandam Comments about His Role in Game Changer Movie

బ్రహ్మానందం ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో బ్రహ్మానందం చెప్పిన కొన్ని విషయాలు, చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వ్యక్తి, ప్రవర్తన, ఆలోచన, తీరు లాంటి విషయాల గురించి మాట్లాడారు బ్రహ్మానందం. ఆ మాటలు వింటుంటే ఇటీవల చిరంజీవి (Chiranjeevi) నోరు జారి మాట్లాడిన మాటల్ని మరీ సీరియస్‌గా తీసుకోవద్దు అని చెప్పినట్లు అయింది. అయితే చిరంజీవి మాటలు అనకముందు ఈ ఇంటర్వ్యూ రికార్డు చేయడం వల్ల ఆ చిరు మాటకు బ్రహ్మానందం రియాక్ట్ అయినట్లు కాదు అని చెప్పాలి.

Brahmanandam about Chiranjeevi issue

ఏదో ఒక సందర్భంలో, ఓ మూడ్‌లో ఓ వ్యక్తి అన్న మాటల్ని పట్టుకుని అతని కేరక్టర్‌ని అంచనా వేయడం సరికాదు. ఆయన ఎందుకు అలా మాట్లాడారు, ఆ విషయం వదిలేస్తే ఆయన ఎలాంటి వాడు అనే వివరాలు మన పట్టించుకోవాలి. ఒక్క విషయంలో ఇబ్బంది వస్తే ఆ వ్యక్తిని ఒక గాటన కట్టేయడం సరికాదు అని బ్రహ్మానందం చెప్పారు. ఆ సందర్భంలో, ఏదో ఆలోచనలో, ఓ మాడ్యులేషన్‌ మాట్లాడిన విషయాలు అంటూ బ్రహ్మీ చెప్పుకొచ్చారు.

Brahmanandam about Chiranjeevi issue

ఈ క్రమంలో బ్రహ్మానందం నటుడు అవ్వడానికి చిరంజీవి పడ్డ శ్రమ అనే విషయం ముందు మిగిలిన కామెంట్‌ విషయం చిన్నదే. ఆయన అలా ఎందుకు మాట్లాడాడు అనేది ఆయన ఇష్టం. కాబట్టి ఈ విషయంలో ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది అనేది నెటిజన్ల సూచన. నిజానికి ఈ విషయంలో ఇప్పటికే చిరు మాట్లాడి, క్లారిటీ వచ్చి ఉంటే బాగుండు అనే వాదన కూడా వినిపిస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.