March 15, 202512:56:06 AM

Brahmastra: ‘బ్రహ్మాస్త్ర 2’ పై క్లారిటీ ఇచ్చిన హీరో!

Update on Brahmastra movie sequel

2022 లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది ‘బ్రహ్మాస్త్ర’ (Brahmāstra) (మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర : శివ’). ఇది బాలీవుడ్ సినిమా అయినప్పటికీ తెలుగు వెర్షన్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. టాక్ సో సోగా ఉన్నా.. ఇక్కడ మంచి వసూళ్లు సాధించింది. కానీ హిందీలో బ్రేక్ ఈవెన్ కాలేదు. అబౌవ్ యావరేజ్ రిజల్ట్ దగ్గరే ఆగిపోయింది. అక్కినేని నాగార్జున (Nagarjunaa), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) Mouni Roy, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు.

Brahmastra

అందువల్ల మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ మొదటి భాగం రిలీజ్ అయ్యి రెండేళ్లు దాటినా ఇప్పటికీ ఆ ప్రాజెక్టు మొదలుకాలేదు. మరోపక్క అయాన్ ఎన్టీఆర్,హృతిక్..లతో ‘వార్ 2’ చేస్తున్నాడు. దీంతో ‘బ్రహ్మాస్త్ర 2’ ఉండదేమో అని అంతా అనుకున్నారు. ఈ క్రమంలో హీరో రణబీర్ కపూర్ ఆ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు

Update on Brahmastra movie sequel

రణబీర్ కపూర్ (Ranbir Kapoor) మాట్లాడుతూ.. ” ‘బ్రహ్మాస్త్ర 2’ మా దర్శకుడు అయాన్ ముఖ‌ర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే ప్రస్తుతం ఆయ‌న ‘వార్ 2’ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. అది కంప్లీట్ అయ్యాక ‘బ్రహ్మాస్త్ర 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారు. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు ఉంటుంది. ‘బ్రహ్మాస్త్ర’ విషయంలో అయాన్ విజన్ చాలా పెద్దది. ఇప్పుడు మనం చూసింది కొంతే..! అసలైన కథ పార్ట్ 2లోనే ఉంటుంది.

Update on Brahmastra movie sequel

త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తాం” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ‘బ్రహ్మాస్త్ర 2’ ప్రాజెక్టులో రణబీర్ పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే సెకండ్ పార్ట్ ఎక్కువగా రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) , దీపికా పదుకొనె (Deepika Padukone)..ల పాత్రలతో ఉంటుందని మొదటి భాగంలో రివీల్ చేశారు. అలా చూసుకుంటే రణబీర్ కపూర్ పాత్ర తక్కువగానే ఉండొచ్చు అని చాలా మంది అనుకున్నారు. చూడాలి మరి.. అయాన్ ఎలా ప్లాన్ చేశాడో..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.