March 15, 202501:04:00 AM

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం.. టీవీలో హిట్టా ఫట్టా?

Record TRP Rating for Sankranthiki Vasthunam Movie

విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) – అనిల్ రావిపూడి (Anil Ravipudi)  కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)  బుల్లితెరపై కూడా మాస్ హిట్ కొట్టింది. థియేటర్లలో 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన ఈ సినిమా, ఇటీవల జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారమైంది. అటు థియేటర్స్, ఇటు ఓటీటీ తర్వాత కూడా బుల్లితెరపై ఈ సినిమా మరోసారి సత్తా చాటింది.సాధారణంగా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత టీవీలో సినిమాలకు పెద్దగా రెస్పాన్స్ ఉండదు.

Sankranthiki Vasthunam

కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం అందుకు భిన్నంగా 18.22 TRP సాధించింది. SD ఛానెల్‌లో 15.92, HD ఛానెల్‌లో 2.3 రేటింగ్ రావడం పెద్ద రికార్డ్‌గా మారింది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ అయిన ఈ సినిమా, ప్రేక్షకులను టీవీ స్క్రీన్ ముందు కట్టిపడేసింది. ఇంతకుముందు అనిల్ రావిపూడి F2 (F2 Movie) , F3 (F3 Movie) సినిమాలు టీవీలో హై TRP సాధించాయి. ఇప్పుడు అదే కాంబో మరోసారి తన పవర్ చూపించింది.

Sankranthiki Vasthunam Movie 25 Days Total Worldwide Collections

సంక్రాంతికి వస్తున్నాంకి వచ్చిన ఈ భారీ TRP చూస్తే, భవిష్యత్తులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ఇంకా మంచి డిమాండ్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ టీవీ రేటింగ్ చూస్తే మరో విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు.. మంచి కంటెంట్ ఉంటే ఎక్కడైనా హిట్ అవుతుంది. థియేటర్లలో ఆడిన సినిమా ఓటీటీలో హిట్ అవుతూనే, బుల్లితెరపైనా అదే జోరు చూపిస్తుందనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్.

These kids got huge appreciation for Daaku Maharaaj and Sankranthiki Vasthunam

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబో బయ్యర్లకు గోల్డ్ మైన్‌గా మారిపోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ హిట్‌తో సంక్రాంతికి వస్తున్నాం టీమ్‌కు పెద్ద ఊరట లభించింది. ఇక భవిష్యత్తులో అనిల్ రావిపూడి, వెంకటేశ్ కలసి మరో ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. ఇక దానిపై ఉత్కంఠ మాత్రం ప్రేక్షకుల్లో మరీంత పెరుగుతోంది. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

 ‘ఏజెంట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోయే 13 సినిమాల లిస్ట్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.