
నాని (Nani) నిర్మాణంలో ‘కోర్ట్'(Court) సినిమా రూపొందింది. రేపు అనగా మార్చి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం నిన్న అంటే మార్చి 12న మీడియా కోసం స్పెషల్ గా షో వేయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత అందరూ తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. టాలీవుడ్లో ఇప్పటివరకు వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాల్లో ఇది బెస్ట్ మూవీ అని పేర్కొన్నారు.
Shivaji
కానీ పరభాషల్లో రూపొందిన ‘ఓ మై గాడ్’ ‘పింక్’ ‘జై భీమ్’ రేంజ్ సినిమాలతో పోల్చి దీన్ని తక్కువగా చూడకూడదు అని నొక్కి మరీ చెబుతున్నారు. మరోపక్క ఈ సినిమాలో మంగపతి అనే నెగిటివ్ రోల్లో సీనియర్ హీరో శివాజీ (Sivaji) నటించాడు. ‘కోర్ట్’ లో హైలెట్ అంటే అంతా మంగపతి పాత్ర గురించే చెబుతున్నారు. దర్శకుడు రామ్ జగదీష్ ఈ పాత్రని చాలా బాగా డిజైన్ చేశాడు అని చెప్పాలి.
‘సినిమాలో లవ్ స్టోరీ విసిగిస్తుంది’ అనే టైంలో మంగపతి పాత్ర ఎంట్రీ ఇవ్వడం.. ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా అని మంగపతి కమెడియన్ రోల్ అనుకోకండి. మూర్ఖత్వంతో నిండిపోయిన ఓ పెద్దమనిషి లాంటి పాత్ర. ఆడపిల్లల్ని అతి జాగ్రత్తగా పెంచితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనే మెసేజ్ ను కూడా ఈ పాత్రతో అందరికీ చేరువయ్యేలా చేశారు. అయితే క్లైమాక్స్ లో ఈ పాత్రకి ఇచ్చిన ఎండింగ్ ఎందుకో అంత సంతృప్తిని ఇవ్వదు.
ముఖ్యంగా హీరో ప్రియదర్శి (Priyadarshi Pulikonda) మంగపతిని విచారించే సీన్ చాలా సింపుల్ గా కానిచ్చేశారు. వారిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ ని ఇంకాస్త పొడిగిస్తే బాగుండేది. ఏదేమైనా మంగపతి అయితే విశ్వరూపం చూపించాడు. టాలీవుడ్ కి విలన్ల కొరత ఉన్న ఈ తరుణంలో శివాజీ రూపంలో ఆ లోటు తీరినట్టే అని చెప్పాలి. మిడ్ రేంజ్ సినిమాల్లో విలన్ గా శివాజీ (Shivaji) బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.