March 17, 202501:33:03 AM

ఉత్తరాఖండ్‌లో తల్లిదండ్రుల గల్లంతు; కూతురు ఆత్మహత్య !


ఉత్తరాఖండ్‌లో వరదలు సృష్టించిన విలయం దేశంలో ఎందరికో గుండెకోతను మిగులుస్తోంది. కేదార్‌నాథ్‌కు వెళ్లి తన తల్లిదండ్రులు తిరిగి రాకపోవడంతో మనోవేదనకు గురై ఓ మహిళ ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మమత త్రిపాఠి(35) తల్లిదండ్రులు కమలాదేవీ(50), నాథూరాం పరాశర్(60)తోపాటు ఆమె అత్తామామ జూన్ 5న కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లారు. 

తన తల్లిదండ్రులతో మమత ఈనెల 15న చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత నుంచి వారి నుంచి సమాచారం లేదు. వారిని వెతికేందుకు మమత భర్త కూడా ఈనెల 18న హరిద్వార్ వెళ్లారు. తన కన్నవారు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్థానిక అమ్మవారి ఆలయంలో శుక్రవారం పూజలు చేసింది. ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు భోజనం తయారుచేసింది. అనంతరం తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడింది. 

Tags: News, Telugu News, Andhra News
Labels: ,

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.