March 15, 202501:04:00 AM

Pv Narasimha Rao: భారతరత్న పీవీ నరసింహారావు బయోపిక్‌… ఏం చూపిస్తారంటే?

ప్రముఖ రాజకీయ నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జీవిత చరిత్రను వెబ్‌ సిరీస్‌గా రూపొందిస్తామని ఆహా ఓటీటీ చాలా నెలల క్రితమే ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆ సిరీస్‌ ఇక ఆగిపోయిందేమో అనుకుంటుండగా… ఇప్పుడు సిరీస్‌ గురించి మరోసారి సమాచారం ఇచ్చారు. ఇటీవల పీవీకి కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ సిరీస్‌పై ఆహా పోస్ట్‌ పెట్టింది.

పీవీ నరసింహారావు బయోపిక్‌ను రూపొందించడం తమకు ఎంతో గర్వంగా, ఉత్సాహంగా ఉందని చెప్పిన టీమ్‌… వినయ్‌ సీతాపతి రాసిన ‘ది హాఫ్‌ లయన్‌’ పుస్తకం ఆధారంగా సిరీస్‌ తెరకెక్కిస్తామని తెలిపింది. ఆ సిరీస్‌కు అదే పేరును పెడుతున్నామని చెప్పింది. ప్రముఖ నిర్మాత ప్రకాశ్‌ ఝా ఈ సిరీస్‌ను రూపొందిస్తారు. ఆహా స్టూడియో, అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. ఈ వివరాలతో ఆహా తాజాగా ఓ వీడియోను షేర్‌ చేసింది.

పీవీ నరసింహారావు (Pv Narasimha Rao) ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి వల్ల దేశంలో వచ్చిన మార్పులను సిరీస్‌లో చూపిస్తారట. పీవీ రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పీవీ నవభారతాన్ని నిర్మించిన నాయకుడని ప్రకాశ్‌ ఝా కొనియాడారు. సిరీస్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలో మరిన్ని ఆసక్తికర అంశాలు చెబుతామని టీమ్‌ పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు.

1991 నుండి 1996 వరకు ప్రధాన మంత్రిగా, అంతకుమునుపు రాజకీయ నాయకుడిగా పీవీ నరసింహారావు అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించటంలో ఆయనెంతో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన గురించి ఆసక్తికర విషయాలు తెలిపే సిరీస్‌ అంటే ఇంట్రెస్టింగ్‌ అని చెప్పాలి. అన్నట్లు ఈ సిరీస్‌కు సెలబ్రేటింగ్‌ ది మోస్ట్‌ అన్‌ సెలబ్రేటెడ్‌ ఎకనామిక్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ఇండియా.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.