March 14, 202508:38:50 PM

Ram Charan: రామ్‌చరణ్‌ 17వ సినిమా ఏంటి? ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు!

రామ్‌చరణ్‌ నెక్స్ట్‌ సినిమా ఏంటి? గత కొన్ని రోజులుగా ఈ విషయంలో చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆయన చేయబోయే సినిమా అంటే 16వ సినిమా తర్వాత ఏం చేస్తారో ఇంతవరకు చెప్పలేదు చరణ్‌. చాలా కథలు వింటున్నా ఏదీ ఓకే చేయలేదు అని ఇండస్ట్రీ వర్గాల మాట. దీంతో చాలామంది కొత్త దర్శకులు పేర్లు, స్టార్‌ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వాటన్నింటిని పక్కన పెట్టేయాల్సిన సమయం వచ్చేసింద అంటున్నారు.

అంటే… చరణ మరిక సినిమాలు చేయడా అని అనుకోవద్దు. అయితే తెలుగులో మాత్రం ఆ సినిమా ఉండదు అంటున్నారు. ఎందుకంటే చరణ్‌ తన 17వ సినిమాను బాలీవుడ్‌ దర్శకుడితో అక్కడి నిర్మాణ సంస్థలోనే చేయాలని ఫిక్స్‌ అయ్యాడట. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. దర్శకుడు ఎవరు అనేది చెప్పలేదు కానీ… నిర్మాణ సంస్థ మాత్రం బాలీవుడ్‌దే అని చెబుతున్నారు. అయితే ఓ తెలుగు నిర్మాణ సంస్థ భాగస్వామిగా ఉంటుందట.

రామ్‌చరణ్‌ (Ram Charan) చాలా రోజుల నుండి బాలీవుడ్‌కి తరచుగా వెళ్లి వస్తున్నాడు. ముంబయికి వెళ్లడం, అక్కడ తిరగడం, కొన్ని సినిమా ఆఫీసుల దగ్గర చరణ్‌ టీమ్‌ కనిపించడం లాంటివి మనం చూశాం. అయితే ఎక్కడా ఏ సినిమా కోసం వెళ్తున్నాడు అనే వివరాలు బయటకు రాలేదు. అయితే సంజయ్‌ లీలా భన్సాలీ, రాజ్‌ కుమార్‌ హిరానీ లాంటి దర్శకులతో మాట్లాడారు అని మాత్రం సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో ఈ ఇద్దరిలో ఒకరు చరణ్‌ తర్వాతి దర్శకుడు అవుతారు అని చెప్పొచ్చు.

ఓవైపు ప్రభాస్‌ వరుసగా హిందీ ప్రాజెక్టులు ఓకే చేయాలని చూశాడు. ‘ఆదిపురుష్‌’ తర్వాత ఆ ఆలోచన హోల్డ్‌లో పెట్టాడు. ఎన్టీఆర్‌ అయితే ‘వార్‌ 2’ ఓకే చేసేశాడు. కానీ ఇంకా షూటింగ్‌ వరకు వెళ్లేదు. ఇప్పుడు చరణ్‌ కూడా హిందీ ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే మరింత మంది తెలుగు హీరోలు ఇలా చేస్తారు అనిపిస్తోంది.


Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.