Aa Okkati Adakku: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆ ఒక్కటీ అడక్కు’ .. రన్ టైమ్ ఎంతంటే?

రెండు, మూడు సీరియస్ సినిమాల తర్వాత ఫుల్ లెన్త్ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అల్లరి నరేష్ (Allari Naresh). ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku)  అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకుడు. ‘చిలక ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై రాజీవ్ చిలక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్ కాగా .. స్టార్ రైటర్ అబ్బూరి రవి ఈ చిత్రానికి డైలాగ్స్ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. టీజర్‌, ట్రైలర్‌..బాగున్నాయి.

ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. గోపీసుందర్ (Gopi Sundar) సంగీతంలో రూపొందిన పాటలు కూడా మంచి మార్కులు వేయించుకున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి క్లీన్ యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది సెన్సార్ యూనిట్. 2 గంటల 14 నిమిషాల క్రిస్ప్ రన్ టైం ను లాక్ చేశారట.ఈ సమ్మర్ కి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ హ్యాపీగా థియేటర్ కి వచ్చి చూడదగ్గ సినిమా ఇదని సినిమా చూశాక సెన్సార్ వారు తెలియజేశారట.

అంతేకాదు.. ‘ఇదొక యూనివర్సల్ పాయింట్ తో రూపొందిన సినిమా అని, ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే కుర్రాడిగా హీరో అల్లరి నరేష్ కనిపిస్తాడని, పెళ్లీడు వచ్చినప్పటికీ పెళ్లి కాకపోవడంతో అతను పడే మనోవేదనని వినోదాత్మకంగా చూపించారని అంటున్నారు. అలాగే ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరోల వల్ల జరిగే మోసాలు కూడా ఇందులో చూపించి ఓ మెసేజ్ కూడా ఇచ్చారని సెన్సారు వారు తెలియజేశారు. మొత్తానికి ఇది కచ్చితంగా అల్లరి నరేష్ కి మంచి సక్సెస్ ను అందిస్తుంది అని వారు ధీమాగా చెబుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.