Puri Jagannadh: నిన్ను అవమానిస్తే ఇలా సమాధానం చెప్పు.. పూరీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ కు (Puri Jagannadh) ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమాతో సక్సెస్ అందుకోవాలని భావిస్తున్న పూరీ జగన్నాథ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. తాజాగా పూరీ జగన్నాథ్ ఇన్ సల్ట్ గురించి పూరీ మ్యూజింగ్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో చాలాసార్లు మనం అవమానానికి గురవుతామని పూరీ అన్నారు. ఎవరో ఏదో ఒక మాట అంటారని ఆ సమయంలో చాలా బాధగా అనిపిస్తుందని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

ఇలాంటి సంఘటన జరిగిన సమయంలో బాధ పడకూడదని హుందాగా ఉండాలని ఆయన కామెంట్లు చేశారు. ఆ సమయంలో మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలని పూరీ అన్నారు. ఏ సమయంలో అవమానం జరిగిందో అర్థం చేసుకోవాలని ఎవరు నిన్ను అవమానించారో గమనించాలని ఆయన తెలిపారు. ఏ ఉద్దేశంతో నిన్ను అవమానించారు? చిన్న విషయానికే అవమానించారా? పర్సనల్ లైఫ్ గురించి చులకనగా మాట్లాడారా? నీ జాతి గురించి ఏమైనా అన్నారా? అనేది గమనించాలని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

మిమ్మల్ని ఎక్కడ అవమానించారో దృష్టిలో పెట్టుకుని స్పందించాలని పూరీ జగన్నాథ్ వెల్లడించారు. అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా మౌనంగా ఉండాలని పూరీ తెలిపారు. ఎందుకంటే అవతలి మనిషి నిన్ను కావాలనే అవమానిస్తున్నాడనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన కామెంట్లు చేశారు. నువ్వు కోప్పడితే ఎదుటివాడు గెలిచినట్లేనని నువ్వు రియాక్ట్ అయితే ఇంకా రెచ్చగొడతాడని పూరీ పేర్కొన్నారు.

అలాంటప్పుడే హ్యూమర్ వాడి నవ్వాలని పూరీ పేర్కొన్నారు. ఏదైనా చెప్పాలనిపిస్తే “నన్ను అవమానపరిచేలా మాట్లాడినందుకు థ్యాంక్స్.. ఇలా జరిగిన ప్రతిసారీ ఎదిగాను” అని చెప్పాలని పూరీ వెల్లడించారు. పూరీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూరీ కామెంట్స్ నిజమేనని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.