March 21, 202512:07:13 AM

Balakrishna: బాలయ్య బాబీ మూవీ టైటిల్ విషయంలో అలాంటి నిర్ణయం తీసుకున్నారా?

ఈ మధ్య కాలంలో స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna) వరుస విజయాలు సాధించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండగా ఒక సినిమాను మించి మరో సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. అఖండ (Akhanda) , వీరసింహారెడ్డి (Veera Simha Reddy) , భగవంత్ కేసరి (Bhagavanth Kesari) బాలయ్య మార్క్ కథాంశాలతో తెరకెక్కి నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయి. అయితే బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ టైటిల్ ను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ సినిమా షూటింగ్ ఏకంగా 50 శాతం పూర్తైందని సమాచారం అందుతోంది.

చాందిని చౌదరి (Chandini Chowdary) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి వీరసింహారెడ్డి మూవీ టైటిల్ ను ప్రకటించారు. బాలయ్య బాబీ మూవీ టైటిల్ విషయంలో సైతం ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య బాబీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు సందడి చేస్తుందో చూడాల్సి ఉంది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తో బాలయ్య బిజీ కానున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.

థమన్ (Thaman) ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఈ సినిమాకు రివర్స్ స్క్రీన్ ప్లే ఫాలో అవుతున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య భవిష్యత్ ప్రాజెక్ట్ లన్నీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య మరోసారి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో నటించే హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి త్వరలో క్లారిటీ రానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కు ఈ సినిమాతో శ్రీకారం చుడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.