March 14, 202508:38:52 PM

‘పరాక్రమం’ చిత్రం నుంచి మనిషి నేను పాట విడుదల

బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే బండి సరోజ్ కుమార్ స్వరపరిచిన ‘మనిషి నేను’ అనే లిరికల్ వీడియో పాటను సోషల్ మీడియా లో విడుదల చేసారు. హైమత్ మహమ్మద్ ఈ పాటకి తన గాత్రాణి అందించారు.

ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ “పరాక్రమం చిత్రం నుంచి నేను రాసి స్వరపరిచిన ‘మనిషి నేను’ అనే పాటను సోషల్ మీడియా లో విడుదల చేసాము. ఈ పాటని హైమత్ మహమ్మద్ పాడారు. నా పాట అందరికి నచ్చుతుంది అని భావిస్తున్నాను. మా చిత్రాన్ని ఆగష్టు లో విడుదల చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం” అని తెలిపారు

 

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.