March 20, 202505:40:15 PM

Nara Rohit: తన సినిమాపై తనే సెటైర్లు వేసుకున్న నారా రోహిత్.!

నారా రోహిత్ (Nara Rohith) హీరోగా రూపొందిన ‘ప్రతినిథి’ చిత్రం 2014 లో రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించింది. ఆ టైంలో ఎన్నికలు రావడం.. టీడీపీ పార్టీ మైలేజ్ కి, నేతల్లో ఉత్సాహం నింపడానికి కూడా ఆ సినిమా బాగా కలిసొచ్చింది. ఇక ఈ ఏడాది కూడా ఏపీలో ఎన్నికలు జరిగాయి. అదే టైంకి ‘ప్రతినిధి 2’  (Prathinidhi 2) అ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అయ్యింది. కానీ సెన్సార్ సమస్యల వల్ల … చాలాసార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడటం జరిగింది.

Nara Rohit

ఫైనల్ గా మే 10న రిలీజ్ అవ్వడం.. పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడకపోవడం జరిగింది. దీంతో నారా రోహిత్ కి సరైన రీ ఎంట్రీ లభించలేదు. అయితే ఈరోజు జరిగిన ‘సుందరకాండ’ టీజర్ లాంచ్ లో ” ‘ప్రతినిథి 2’ హిట్ అయ్యింది కదా? ‘ప్రతినిథి 3’ ఏమైనా చేస్తారా? ‘ అంటూ నారా రోహిత్ ను ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. ఇందుకు నారా రోహిత్ బదులిస్తూ.. ” ఎక్కడ హిట్ అయ్యిందండీ బాబు.

ఆ సినిమా వచ్చినట్టు కూడా నాకు గుర్తులేదు” అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఇంతలో మరో రిపోర్టర్.. ‘మీరు గ్రేట్.. సినిమా హిట్ అవ్వలేదు అని స్ట్రైట్ గా చెబుతున్నారు’ అంటూ అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది. ఇందుకు నారా రోహిత్ ‘నేను ఇలా చెప్పకపోయినా మీరు వెళ్లి ప్లాప్ అని రాసేస్తారు కదా.! నేనే చెప్పుకోవడంలో ఏముంది’ అంటూ చురకలు అంటించాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.