March 14, 202508:38:54 PM

Sudheer Babu: ఆ మూవీ టీజర్, ట్రైలర్ చూసి సూపర్ స్టార్ అలా రియాక్ట్ అయ్యారా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా మహేష్ బాబు జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని చాలామంది భావిస్తారు. స్టార్ హీరో మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. సుధీర్ బాబు (Sudheer Babu) నటించిన మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Superhero) మూవీ ట్రైలర్ తాజాగా విడుదల కాగా ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ టీజర్ విషయంలో మహేష్ బాబు రియాక్షన్ గురించి చెప్పుకొచ్చారు.

Sudheer Babu

సాధారణంగా మహేష్ బాబు టీజర్ చూసి అంతలా రియాక్ట్ అవ్వరని ఏదైనా మూవీ కంటెంట్ ను పంపిస్తే గుడంటూ సింపుల్ గా జవాబిస్తాడని సుధీర్ బాబు పేర్కొన్నారు. అయితే మా నాన్న సూపర్ హీరో టీజర్ చూసిన సమయంలో హార్ట్ టచింగ్ అంటూ రియాక్ట్ అయ్యాడని సుధీర్ బాబు తెలిపారు. మహేష్ బాబు తొలిసారి నా సినిమాలకు ఆ పదం వాడాడని సుధీర్ బాబు పేర్కొన్నారు.

ట్రైలర్ చూసిన తర్వాత మహేష్ బాబు చాలా బాగుందంటూ ఎమోజీలు పెట్టారని మహేష్ బాబు అన్ని ఎమోజీలు పెట్టడం అదే తొలిసారి అని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. మహేష్ బాబుకు మా నాన్న సూపర్ హీరో కంటెంట్ బాగా నచ్చిందని అర్థమవుతోందని సుధీర్ బాబు (Sudheer Babu) కామెంట్లు చేశారు.

ఈ నెల 11వ తేదీన మా నాన్న సూపర్ హీరో రిలీజ్ అవుతుండగా ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. దసరా కానుకగా రిలీజ్ అవుతుండటం ఈ సినిమాకు ప్లస్ కానుంది. దసరా కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నా ప్రతి సినిమా హిట్ కావాలని సినీ అభిమానులు భావిస్తున్నారు.

‘దేవర’ 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.