March 30, 202507:40:16 PM

రానా దర్శకుడి కొత్త ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా?

శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా తెరకెక్కిన ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు వేణు ఉడుగుల (Venu Udugula) . ఆ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. దీంతో రానా (Rana Daggubati) పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. అలా వీరి కాంబినేషన్లో ‘విరాటపర్వం’ (Virata Parvam) అనే సినిమా రూపొందింది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఈ సినిమాకి కూడా క్రిటిక్స్ నుండి మంచి స్పందన లభించింది. కానీ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. అంతేకాదు.. హీరో రానా కంటే కూడా హీరోయిన్ సాయి పల్లవికి (Sai Pallavi) ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే కంప్లైంట్ కూడా వచ్చింది.

Virata Parvam

ఏదేమైనా ‘విరాటపర్వం’ (Virata Parvam) మంచి ప్రయత్నమే. ఆ తర్వాత వేణు నుండి ఇంకో సినిమా రాలేదు. మధ్యలో ఓ పెద్ద హీరోకి కథ చెప్పి ఒప్పించుకున్నట్టు టాక్ నడిచింది. కానీ అలాంటి పెద్ద ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు ఏవీ బయటకు రాలేదు. ఇదిలా ఉండగా.. వేణు ఉడుగుల ఇప్పుడు నిర్మాతగా మారాడట. అవును..! శైలు కంపాటి అనే అప్ కమింగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయ్‌’ అనే చిత్రాన్ని ఈటీవీ విన్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడట వేణు.

అలా అని ఇది ఓటీటీ సినిమా కాదు. ఈటీవీ విన్ అనగానే అంతా ఇది ఓటీటీ ప్రాజెక్టు ఏమో అని అనుకుంటారు. కానీ కాదు. ఇది థియేట్రికల్ ప్రాజెక్టు అని సమాచారం. ఇదొక ప్రేమ కథా చిత్రం. ఓ సెన్సిటివ్ టాపిక్ ను కూడా టచ్ చేసినట్టు వినికిడి. మరి ఈ కొత్త ప్రయోగం వేణు ఉడుగులకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

‘కన్నప్ప’ లో ప్రభాస్ లుక్ ఇదేనా.. వైరల్ అవుతున్న పిక్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.