March 17, 202509:22:51 PM

Nayanthara: నయనతార థ్యాంక్స్‌ పోస్ట్‌.. ధనుష్‌ని ఇరిటేట్‌ చేయడానికేనా?

‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అంటూ తన 20 ఏళ్ల సినిమా కెరీర్‌ను సెలబ్రేట్‌ చేసుకుంది ప్రముఖ కథానాయిక నయనతార (Nayanthara). తన పెళ్లి నేపథ్యంలో రెండేళ్ల క్రితం నెట్‌ఫ్లిక్స్‌కు ఇచ్చిన వీడియోను 20 ఇయర్స్‌ స్పెషల్‌గా తీసుకొచ్చారు. మామూలుగా డాక్యుమెంటరీగా ప్రచారం మొదలుపెట్టిన ఈ సిరీస్.. ధనుష్‌  (Dhanush)  ఇష్యూ బయటకు రావడంతో వైరల్‌గా మారి.. ఎక్కువమందికి రీచ్‌ అయింది. డాక్యుమెంటరీ వచ్చేసింది, రీచ్‌ కూడా బాగుండటంతో.. ధనుష్‌ టాపిక్‌ ఇక ముగిసింది అనుకున్నారంతా. కానీ నయనతార ఇన్‌స్టాగ్రామ్‌ మూడు పేజీల నోట్‌ను రిలీజ్‌ చేసింది.

Nayanthara

దీంతో మరోసారి ధనుష్‌ పేరు బయటకు వచ్చింది. దానికి కారణం ఆమె థ్యాంక్స్‌ చెప్పిన నోట్‌లో ఆయన పేరు లేకపోవడమే. తన డాక్యుమెంటరీ కోసం ఈ దిగువ సినిమా వాళ్లను సంప్రదించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ఆమె ఓ లిస్ట్‌ ఇచ్చింది. నేను పని చేసిన ప్రతి చిత్రానికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. సినీ ప్రయాణం ఆనందకరమైన క్షణాలను అందించింది. ఈ క్రమంలో చాలా సినిమాలు నా మనసుకు దగ్గరయ్యాయి.

ఆ జ్ఞాపకాలను, సన్నివేశాలను మా డాక్యుమెంటరీలో చేర్చుకుందామని నిర్మాతలను సంప్రదించినప్పుడు ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదు. వారందరికీ నా ధన్యవాదాలు అని రాసుకొచ్చింది నయన్‌. నయనతార పేర్కొన్న దర్శక నిర్మాతల్లో తెలుగు ఇండస్ట్రీ నుండి చిరంజీవి (Chiranjeevi) , రామ్ చరణ్‌ (Ram Charan), డి. శివప్రసాద్‌ రెడ్డి (D. Siva Prasad Reddy), యలమంచిలి సాయిబాబు ఉన్నారు. బాలీవుడ్ నుండి షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) , గౌరీ ఖాన్‌ (Gauri Khan) ఉన్నారు.

తమిళ పరిశ్రమ నుండి కె.బాలచందర్‌ (K. Balachander) , పుష్ప కందస్వామి, సుభాస్కరన్‌, ఇషారి కె.గణేశ్, కల్పతి అఘోరం, గణేశ్‌, సురేశ్‌, అర్చన కల్పతి, ఉదయనిధి స్టాలిన్‌, షెన్బాగమూర్తి, రామ్‌కుమర్‌ గణేశన్‌, ఎస్‌.ఆర్‌.ప్రభు, ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు, కరుణమూర్తి, కొట్పాడి జె.రాజేశ్‌, ఆర్‌.డి.రాజా, జ్ఞానవేళ్‌ రాజా, ఏఆర్‌ మురుగదాస్‌ (A.R. Murugadoss) , షిబు తమీజ్‌ తదితరులు ఉన్నారు. ఈ లిస్ట్‌ ద్వారా వాళ్లకు థ్యాంక్స్‌ చెప్పడంతోపాటు.. ధనుష్‌ తనకు ఫుటేజ్‌ అడిగిన వెంటనే ఇవ్వలేదని, ఉచితంగా ఇవ్వలేదని చెప్పడం ఆమె ఉద్దేశంలా కనిపిస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.