March 16, 202511:32:21 AM

Mohan Babu: మంచు మనోజ్ పై కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మోహన్ బాబు.. కానీ!

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు(Mohan Babu)  ఇంట్లోని గొడవలు వీధిలో పడినట్టు అయ్యింది. ఆల్రెడీ మంచు మనోజ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మోహన్ బాబు కూడా తన చిన కొడుకు మంచు మనోజ్ పై అలాగే అతని భార్య మౌనికపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. రాచకొండ పోలీస్ కమిషనర్ కు మోహన్ బాబు కంప్లైంట్ రాసి ఇచ్చినట్లు తెలుస్తుంది. ‘మంచు మనోజ్  (Manchu Manoj) నుండి నాకు ముప్పు పొంచి ఉంది.

Mohan Babu

నాకు రక్షణ కల్పించాలి’ అంటూ మోహన్ బాబు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. “4 నెలల క్రితం నా ఇంటి నుండి వెళ్లిపోయిన మంచు మనోజ్… మళ్లీ నా ఇంటికి వచ్చి, కొందరు సంఘ విద్రోహ శక్తులతో కలిసి భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఈ రోజు ఉదయం నా ఇంట్లో పరిచయం లేని కొత్త వ్యక్తులు ఉండడాన్ని గమనించాను. నేను ‘ఆఫీసుకు వెళ్ళగానే, నా ఇంటి వద్ద పరిస్థితి బాలేదని’ మా టీం వచ్చి చెప్పారు.

Manchu Manoj, Mohan Babu

మనోజ్ కు చెందిన 30 మంది వ్యక్తులు మా ఇంటికి వచ్చి నాకు నా సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. మంచు మనోజ్, మౌనికల ఆజ్ఞల వల్లే వాళ్ళు ఇలా ప్రవర్తించారని.. ఆ బ్యాచ్ అంతా నా ఇంటిలోనే తిష్ట వేసి, నా కోసం కాచుకుని ఉన్నారు. నా ఇంటికి నేను వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు నా వయసు 78 ఏళ్ళు. ఈ వయసులో ఇలాంటి దారుణాలు నేను చూడలేకపోతున్నాను. నా ఆస్తులు కూడా ప్రమాదంలో పడ్డాయి.

Manchu Manoj

అందుకే నా కొడుకు మనోజ్, కోడలు మౌనికపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నా ఇంటి నుండి మనోజ్, మౌనికలతో పాటు ఆ మిగిలిన బ్యాచ్ ను కూడా పంపించేయాలని కోరుతున్నాను” అంటూ ఆ కంప్లైంట్లో మోహన్ బాబు పేర్కొన్నారు.అయితే మొదట మోహన్ బాబు ఓ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయగా..పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదట. తర్వాత అతని పలుకుబడి వాడి ఈ కంప్లైంట్ ఫైల్ చేసినట్లు ఇన్సైడ్ టాక్.

మొత్తానికి మనోజ్ ఓపెన్ అయిపోయాడు.. మెడికల్ రిపోర్ట్ వైరల్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.