March 25, 202510:25:32 AM

Chhaava: పాన్ ఇండియా సినిమాలకి ‘ఛావా’ ఓ పాఠం!

Chhaava movie content lesson to pan india movies

ఇటీవల బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సినిమా ఛావా (Chhaava) , దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, సామాన్య ప్రేక్షకుడి హృదయాన్ని తాకేలా రూపొందింది. ముఖ్యంగా, హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal)  తన నటనతో శంభాజీ పాత్రకు ప్రాణం పోశాడు. రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా తన శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ ఎక్కడికక్కడ స్ప్రెడ్ అవుతూ, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది.

Chhaava

Chhaava movie content lesson to pan india movies

హిందీతోపాటు, ఓవర్సీస్ లో కూడా సినిమా సత్తా చూపిస్తూ, శుక్రవారం నుండి ఆదివారం వరకు భారీ కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా, ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాకపోయినప్పటికీ, ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో సినీ ప్రేమికులు మరో ఆసక్తికరమైన పాయింట్‌ను చర్చిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ పైనే ఆధారపడుతుండగా, ఛావా మాత్రం సింపుల్ కాన్సెప్ట్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, పర్‌ఫార్మెన్స్ తోనే విజయం సాధించింది.

Chhaava movie audience angry destroys screen

ఎలాంటి హై ఫై విజువల్స్ లేకుండా, కేవలం కథే సినిమాను ముందుకు తీసుకెళ్లింది. ఇంకా, సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను కదిలించి, ఎమోషనల్ హై పాయింట్ కి తీసుకెళ్లాయి. ప్రతీ దృశ్యం సజీవంగా అనిపించేలా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ హ్యాండిల్ చేశారు. ఛావా తెలుగులో రిలీజ్ అయితే కూడా ఇక్కడి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించే అవకాశముంది.

ఇప్పుడు ప్రధానంగా చర్చ ఏమిటంటే టాలీవుడ్ నిర్మాతలు కూడా కంటెంట్ బలంపై ఆధారపడే సినిమాలు చేయాలనే పాయింట్. అన్ని కోణాల్లో ప్రేక్షకులను టార్గెట్ చేయాలంటే, కథే కీలకమని ఛావా ప్రూవ్ చేసింది. మరి, ఈ సినిమా ఇక్కడ డబ్బింగ్ అవుతుందా? లేక హిందీలోనే కంటిన్యూ అవుతుందా? అనేది వేచి చూడాలి.

సినిమాల్లోకి వచ్చిన 30 ఏళ్ళకి టాలీవుడ్ డెబ్యూ ఇస్తుందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.