March 21, 202502:01:25 AM

Ananya Nagalla: పవన్ రాజకీయాల్లోకి రావడం ప్రజల అదృష్టం.. అనన్య నాగళ్ల కామెంట్స్ వైరల్!

పవన్ కళ్యాణ్ (Pawan-Kalyan) 2019 ఎన్నికల తర్వాత నటించిన సినిమాలలో వకీల్ సాబ్ (Vakeel Saab) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది. పవన్ 2024 ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సెలబ్రిటీల మద్దతు కూడా ఉందనే సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ లో నటించిన అనన్య నాగళ్ల (Ananya Nagalla)  పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తంత్ర (Tantra) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య నాగళ్ల చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తప్పకుండా ఏపీకి సీఎం కావాలని పవన్ కళ్యాణ్ కు సినిమాలతో పోల్చి చూస్తే రాజకీయాలపై ఆసక్తి ఎక్కువని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం ప్రజల అదృష్టమని అనన్య నాగళ్ల చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తారని అనన్య తెలిపారు.

స్టార్ హీరో స్టేటస్ ను వదులుకొని పాలిటిక్స్ లోకి రావడం సాహసం అని అమె పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ప్రజల నుంచి కూడా సపోర్ట్ లభించాలని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని నేను మాత్రం బలంగా కోరుకుంటున్నానని అనన్య నాగళ్ల కామెంట్లు చేశారు. అనన్య చెప్పిన విషయాలను ఆమె ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ చేస్తుండటం గమనార్హం.

మరోవైపు అనన్య నటించిన తంత్ర మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. కొంతమంది ఈ సినిమా నచ్చిందని చెబుతుండగా మరి కొందరు ఈ సినిమా నచ్చలేదని చెబుతున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. అనన్య నాగళ్ల కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. అనన్య సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.