
‘ఛావా’ (Chhaava) సినిమా ఫిబ్రవరి 14న హిందీలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. హిందీలో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. దీంతో తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. మార్చి 7న ఈ సినిమా తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతోంది.
Chhaava
‘గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ’ పై బన్నీ వాస్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అండ్ డీటెయిల్స్ ఎంతో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 0.70 cr |
సీడెడ్ | 0.30 cr |
ఉత్తరాంధ్ర | 0.40 cr |
ఈస్ట్ | 0.10 cr |
వెస్ట్ | 0.08 cr |
గుంటూరు | 0.10 cr |
కృష్ణా | 0.10 cr |
నెల్లూరు | 0.08 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.86 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.40 cr |
తెలుగు వెర్షన్ (టోటల్) | 2.26 cr |
‘ఛావా’ చిత్రానికి రూ.2.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. హిందీలో పెద్ద హిట్ అయిన సినిమా కాబట్టి తెలుగులో కూడా బాగా రాబడుతుంది అని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ నమ్ముతుంది. చూడాలి మరి వాళ్ళ నమ్మకం ఎంత బలమైనదో..!