March 13, 202501:05:01 PM

Varun Tej: ‘మట్కా’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా మరోసారి బయటపడ్డ ‘మెగా’ విభేదాలు!

కొణిదెల – అల్లు కుటుంబాల మధ్య ఆల్‌ ఈజ్‌ వెల్‌ అని అంటుంటారు కానీ.. వాళ్ల హీరోల మాటలు చూస్తుంటే, చేష్టలు చూస్తుంటే ఏదో తేడా అనిపిస్తూ ఉంటుంది. మేమంతా ఒకటే అని ఒక వేదిక మీద చెబితే.. మరో వేదిక మీద ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ‘మట్కా’ (Matka) సినిమా ప్రీ రిలీజ్‌లో వరుణ్‌తేజ్‌ (Varun Tej)  మాటలు కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఆ వేదిక మీద వరుణ్‌.. అల్లు అర్జున్‌ (Allu Arjun) గురించి ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడాడు అని అనిపిస్తోంది.

Varun Tej

స్ట్రయిట్‌గా పాయింట్‌కి వస్తే.. ‘‘జీవితంలో నువ్వు పెద్దోడు అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు. కానీ.. నువ్వు ఎక్కడ నుండి మొదలు పెట్టావ్? ఎక్కడ నుంచి వచ్చావ్? నీ సపోర్ట్ ఎవరు? అనేది మర్చిపోతే నీ సక్సెస్ దేనికీ పనికి రాదు’’ అని అన్నాడు. ఈ వాక్యాలు చదివినవాళ్లకు ఎవరికైనా వరుణ్‌ మాటలు బన్నీ గురించే అని అనిపిస్తాయి. అయితే అలా ఎందుకు అనుకోవాలి? జనరల్‌గా చెప్పుంటాడు అని కూడా అంటున్నారు. అయితే గతంలో జరిగిందేంటో చూస్తే క్లారిటీ వస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లాడు. తన కుటుంబానికి చెందిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పార్టీ జనసేన తరఫున ఎక్కడా ప్రచారం చేయని ఆయన, తన స్నేహితుడు కోసం అంటూ శిల్పా రవి ఇంటికి వెళ్లాడు. దీంతో మెగా వర్సెస్‌ అల్లు ఫ్యాన్‌ వార్‌ మొదలైంది. ఆ తర్వాత ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ (Maruthi Nagar Subramanyam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీని గురించి బన్నీ ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడాడు. తనకు ఇష్టమైతే వెళ్తా.. వస్తా అంటూ నంద్యాల ఘటన గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రస్తావించాడు.

ఇప్పుడు ఆ ఘటనను, ఆ మాటల్ని దృష్టిలో పెట్టుకుని ‘‘నువ్ ఎక్కడ నుంచి వచ్చావ్? నీ సపోర్ట్ ఎవరు? అనేది మర్చిపోతే నీ సక్సెస్ పనికి రాదు’’ అని వరుణ్ తేజ్ అన్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగే ‘‘ఎంతసేపూ మీ వాళ్ల గురించి మాట్లాడతావని అంటున్నారని.. తాను పెదనాన్న చిరంజీవి (Chiranjeevi) , బాబాయ్ పవన్ కల్యాణ్, అన్నయ్య రామ్ చరణ్ (Ram Charan), తండ్రి నాగబాబు (Naga Babu) గురించి మాట్లాడతానని, అది తన ఇష్టమని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మాటలు ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంటే విషయంలో ఇంకాస్త క్లారిటీ వస్తుంది.

రష్మీక ఎంత బిజీగా ఉందంటే..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.